శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (18:22 IST)

జియోమీ ధాటికి శామ్‌సంగ్ ఏమౌతుందో?

సాధారణంగా పండుగ అంటేనే.. స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడం ఫ్యాషనైపోయింది. పండుగ సందర్భంగా డిస్కౌంట్ సేల్, క్యాష్ బ్యాక్, ఉచిత ఆఫర్లను స్మార్ట్‌ఫోన్లపై ఇవ్వడం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని దక్షిణ కొరియా సంస్థ అయిన శామ్‌సంగ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎమ్10, ఎమ్20 ఫోన్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 
 
బడ్జెట్ రకాలకు చెందిన ఈ రెండు స్మార్ట్ ఫోన్లను శామ్‌సంగ్ పండుగ సందర్భంగా విడుదల చేయడంపై కొత్త చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బడ్జెట్ రకాల స్మార్ట్‌ఫోన్లంటే.. జియోమీ, ఒప్పో, వివో బ్రాండ్‌లే గుర్తుకు వస్తాయి. అందులో ముఖ్యంగా శామ్‌సంగ్‌కు పోటీగా నిలుస్తున్నది జియోమీ మాత్రమే. గత దీపావళి సేల్‌లో కూడా జియోమీ స్మార్ట్‌ఫోన్లే అధికంగా అమ్ముడుపోయాయి. 
 
ఈ నేపథ్యంలో సంక్రాంతికి వచ్చే శామ్‌సంగ్ ఫోన్లు ఏమేరకు అమ్ముడుపోతాయనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జియోమీ ధాటికి శామ్‌సంగ్ తట్టుకుని నిలుస్తుందా అని వాణిజ్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
శామ్‌సంగ్ నుంచి విడుదల అయ్యే శామ్‌సంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్ రూ.9.500లకు, శామ్‌సంగ్ ఎమ్20 రూ.15వేలకు పొందవచ్చు. ఇవి కాకుండా.. శామ్‌సంగ్ ఎమ్30 మోడల్ కూడా మార్కెట్లోకి విడుదల కానున్నట్లు సమాచారం.