బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (08:45 IST)

శామ్‌సంగ్ గ్యాలెక్సీ F54 5G.. ధర రూ. 27,999

Samsung Galaxy F54 5G
Samsung Galaxy F54 5G
శామ్‌సంగ్ ఈ సంవత్సరం తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో ఇప్పటికే వార్తల్లో నిలిచింది. శామ్‌సంగ్ గ్యాలెక్సీ F54 5Gని జూన్ 6న ఆవిష్కరించింది. ఈ పరికరం రూ. 27,999 ధర ట్యాగ్‌తో వస్తుంది.
 
శామ్‌సంగ్ గ్యాలెక్సీ ఫోన్‌లో Exynos ప్రాసెసర్, మన్నికైన బ్యాటరీ, చెప్పుకోదగిన 108 MP కెమెరా, నిగనిగలాడే డిజైన్ ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్‌లు మొదటి చూపులో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. 
 
శామ్‌సంగ్ గ్యాలెక్సీ ఎఫ్ 54 5జీ 8జీబీ రామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన సోలిటరీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 27,999. ఇది రెండు ఆకర్షణీయమైన రంగు ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు.
 
మెటోర్ బ్లూ, స్టార్‌డస్ట్ సిల్వర్. పరికరం ప్రత్యేకంగా ఫ్లిఫ్‌కార్ట్, శామ్‌సంగ్.కామ్ అంటే ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో విక్రయించబడుతుంది.