ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (13:53 IST)

శాంసంగ్ గెలాక్సీ ఎ51, ఎ71 స్మార్ట్‌ఫోన్ల ధరల తగ్గింపు

Samsung Galaxy M51
శాంసంగ్ గెలాక్సీ ఎ51, ఎ71 స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. గెలాక్సీ ఎ51కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.25,250 ఉండగా, దీని ధర రూ.1251 తగ్గింది. దీంతో ఈ వేరియెంట్‌ను ప్రస్తుతం రూ.23,999కు కొనుగోలు చేయవచ్చు. 
 
అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.27,999 ఉండగా, దీని ధరను రూ.2వేలు తగ్గించారు. దీంతో ఈ వేరియెంట్ ప్రస్తుతం రూ.25,999 ధరకు లభిస్తోంది.
 
ఇక గెలాక్సీ ఎ71 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.32,999 ఉండగా దీని ధరను రూ.2వేలు తగ్గించారు. దీంతో ఈ వేరియెంట్ ప్రస్తుతం రూ.30,999 ధరకు లభిస్తోంది. కాగా ప్రస్తుతం తగ్గించిన ధరలకే ఈ ఫోన్లను విక్రయిస్తున్నారు.