ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 జులై 2024 (20:32 IST)

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6 కోసం కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన

Galaxy AI powered Galaxy Z Fold6
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్, తమ ఆరవ తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు - గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 కోసం రికార్డ్ స్థాయిలో ముందస్తు బుకింగ్‌లను అందుకున్నట్లు ప్రకటించింది. మొదటి 24 గంటల్లో, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6  ప్రీ-ఆర్డర్‌లు మునుపటి తరం ఫోల్డబుల్‌లతో పోలిస్తే 40% అధికంగా జరిగాయి. తద్వారా కొత్త జెడ్ సిరీస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. 
 
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6 ప్రీ-ఆర్డర్‌లు ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు భారతదేశంలో జూలై 10న ప్రారంభించబడ్డాయి. కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, ఇటీవల విడుదల చేయబడిన ఎకోసిస్టమ్ పరికరాలతో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ వాచ్ 7, గెలాక్సీ బడ్స్ 3 ప్రో మరియు గెలాక్సీ బడ్స్ 3 జూలై 24, 2024 నుండి భారతదేశంలో విక్రయించబడతాయి.
 
"భారతదేశంలో మా కొత్త ఫోల్డబుల్స్- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 కోసం వినియోగదారుల ప్రతిస్పందనతో మేము సంతోషిస్తున్నాము. కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రీ-ఆర్డర్‌లలో 1.4x పెరుగుదల కనిపించింది. కొత్త టెక్నాలజీని అత్యంత వేగంగా స్వీకరించేవారిలో భారతీయ వినియోగదారులు ఉన్నారని ఇది చూపిస్తుంది. మా కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు, ఇప్పుడు వాటి ఆరవ తరంలో ఉన్నాయి, గెలాక్సీ ఏఐ యొక్క తదుపరి అధ్యాయాన్ని తెరిచి, వినియోగదారు అనుభవాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి. కమ్యూనికేషన్‌లు, ఉత్పాదకత, సృజనాత్మకత అంతటా ప్రత్యేకమైన మొబైల్ అనుభవాలను అందిస్తాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 విజయం భారతదేశంలో మా ప్రీమియం సెగ్మెంట్ నాయకత్వాన్ని ఏకీకృతం చేయడంలో మాకు సహాయం చేస్తుంది” అని శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ అన్నారు.
 
భారతీయ వినియోగదారుల కోసం, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్6 లు శాంసంగ్ యొక్క నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతున్నాయి. కొత్త ఫోల్డబుల్‌లు ఎప్పుడూ లేని విధంగా అత్యంత సన్నని, తేలికైన గెలాక్సీ జెడ్ సిరీస్ పరికరాలుగా నిలవటంతో పాటుగా సరళ అంచులతో సంపూర్ణ సౌష్టవ డిజైన్‌తో వస్తాయి. గెలాక్సీ జెడ్ సిరీస్‌లో మెరుగైన ఆర్మర్ అల్యూమినియం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కూడా అమర్చబడి ఉంది, ఇది ఇప్పటికీ అత్యంత మన్నికైన గెలాక్సీ జెడ్ సిరీస్‌గా నిలిచింది.
 
ధర మరియు లభ్యత
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 రూ. 164999 (12GB+256GB) వద్ద ప్రారంభమవుతుంది, అయితే గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 రూ. 109999 (12GB+256GB) నుండి లభిస్తుంది.