మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 జూన్ 2017 (17:36 IST)

సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలే కాదు.. వ్యక్తిగత వివరాల పోస్టులొద్దు.. కాస్పర్‌స్కై

ఓ వైపు స్మార్ట్ ఫోన్లు.. మరోవైపు సోషల్ మీడియా.. ఇంకోవైపు ఉచిత డేటా.. ఈ మూడు అరచేతిలో ఉన్నందున నేటి యువత.. దించిన తల ఎత్తడం లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో వుంటే చాలు ఈ లోకాన్నే యువత మరిచిపోతుంది. చుట్టుపక్

ఓ వైపు స్మార్ట్ ఫోన్లు.. మరోవైపు సోషల్ మీడియా.. ఇంకోవైపు ఉచిత డేటా.. ఈ మూడు అరచేతిలో ఉన్నందున నేటి యువత.. దించిన తల ఎత్తడం లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో వుంటే చాలు ఈ లోకాన్నే యువత మరిచిపోతుంది. చుట్టుపక్కలా ఏం జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. స్మార్ ఫోన్ల పుణ్యంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. సోషల్ మీడియాల్లో వీడియోలు, ఫోటోలు పోస్టుచేయడం.. వాటిని షేర్ చేయడం వంటివి సర్వసాధారణమైపోయాయి. 
 
అయితే సోషల్ మీడియాలో తెలిసిన వారికి, తెలియని వారికి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం అంత మంచిది కాదంటోంది.. మాస్కోకు చెందిన సెక్యూరిటీ సంస్థ కాస్పెర్‌స్కై. ఎందుకంటే.. వ్యక్తిగత విషయాలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం భద్రతాపరంగా అంత మంచిది కాదని సంస్థ వెల్లడించింది. వ్యక్తిగత వివరాలను తెలియని వారికి పోస్ట్ చేయడం ద్వారా సైబర్ క్రైమ్‌లు అధికమవుతున్నాయని కాస్పర్‌స్కై తెలిపింది. సామాజిక మాధ్య‌మాల్లో ఎంతో మంది యువతీయువకులు తమ పర్సనల్ డేటాను తెలియని వారితో పంచుకుంటున్నార‌ని, వాటిలో అతి సున్నితమైన విషయాలు కూడా ఉంటున్నాయ‌ని పేర్కొంది.
 
సోష‌ల్ మీడియాలో ఉన్న మొత్తం యూజ‌ర్ల‌లో 93 శాతం మంది తమకు సంబంధించిన విషయాల‌ను ఇతరులతో పంచుకుంటున్నార‌ని తెలిపింది. అందులో 45 శాతం మంది త‌మ‌ వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక 70 శాతం మంది యూజ‌ర్లు తమ పిల్లల ఫొటోలు, వీడియోలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న‌ట్లు తెలిపింది. అయితే, ఈ అల‌వాటు మంచిది కాద‌ని.. కాస్పర్‌స్కై హెచ్చరిస్తోంది.