ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2017 (10:27 IST)

''ఆర్మర్-2'' ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్: ధర రూ.17.300.. నీటిలో పడినా ఏమీకాదు..

''ఆర్మర్ 2'' ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను యూల్ ఫోన్ సంస్థ విడుదల చేసింది. ఈ ఫోను అంత సులభంగా పగలదు. నీటిలో పడినా ఏమీ కాకుండా సురక్షితంగా ఉంటుంది. గ్లాస్ ఫైబర్, రీన్ ఫోర్సడ్ పాలీకార్బొనేట్, మెటల్‌తో ఈ ఫ

''ఆర్మర్ 2'' ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను యూల్ ఫోన్ సంస్థ విడుదల చేసింది. ఈ ఫోను అంత సులభంగా పగలదు. నీటిలో పడినా ఏమీ కాకుండా సురక్షితంగా ఉంటుంది. గ్లాస్ ఫైబర్, రీన్ ఫోర్సడ్ పాలీకార్బొనేట్, మెటల్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ ఫోనులో 16 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్న ఈ ఫోన్ డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో లభిస్తోంది. దీని ధర రూ.17.300. 
 
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కేవలం 0.1 సెకండ్ల సమయంలోనే అన్ లాక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. గ్లాస్ ఫైబర్, రీన్ ఫోర్సడ్ పాలీకార్బొనేట్, మెటల్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. -40 డిగ్రీల నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పనిచేసే సామర్థ్యం వుంటుందని సంస్థ వెల్లడించింది.
 
ఫీచర్స్ సంగతికి వస్తే..
ఐదు అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
4700 ఎంఎహెచ్ బ్యాటరీ
2.6 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 64 స్టోరేజ్
256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్.