బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (17:08 IST)

వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ - ఎంత మందిని యాడ్ చేసుకోవచ్చంటే?

whatsapp
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌తో వస్తోంది. స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే వారు వాట్సాప్‌ను వినియోగించనివారంటూ లేరు. దీంతో కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటుంది. 
 
తాజాగా మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను పరిచయంచేసింది. సాధారణంగా ఏదైనా ఒక గ్రూపు నుంచి 512 మంది వరకు యాడ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఇపుడు ఈ పరిమితిని పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఈ టెస్టులు సక్సెస్ అయితే ఏకంగా 1024 మంది ఒక గ్రూపులో యాడ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు ఉన్నదానికంటే ఇది రెట్టింపన్నమాట.