మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (11:03 IST)

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఇన్‌-యాప్‌ నోటిఫికేషన్ పేరుతో...?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ వచ్చేసింది. గత వారం స్టిక్కర్‌ ప్యాక్‌, కొత్త వాల్‌పేపర్స్‌, స్టిక్కర్ సెర్చ్‌ వంటి అప్‌డేట్స్‌తో సందడి చేసిన వాట్సాప్ తాజాగా ఈ కొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. ఇన్‌-యాప్‌ నోటిఫికేషన్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో యాప్‌కి సంబంధించిన వివిధ రకాల అప్‌డేట్‌లను యూజర్స్‌కి సులభంగా తెలియజేస్తుంది. 
 
ఇన్‌-యాప్‌తో ఉపయోగం ఏంటంటే..వాట్సాప్‌కి సంబంధించి కొత్త అప్‌డేట్స్‌ ఏమైనా వచ్చినా, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా నోటిఫికేషన్ ద్వారా యూజర్స్‌కి తెలియజేస్తుంది. అలానే వాట్సాప్‌ పంపినట్లు నకిలీ ఖాతాల ద్వారా యూజర్‌ పంపే మెసేజ్‌లకు ఈ ఫీచర్‌తో చెక్ పెట్టోచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ యాపిల్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్స్‌కి పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది.
 
ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలకునే వారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేస్తే ఇన్‌-యాప్‌ నోటిఫికేషన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో అలర్ట్‌ స్టైల్‌, సౌండ్స్‌, వైబ్రేట్ అని మూడు సెక్షన్స్‌ ఉంటాయి. వాటిలో అలర్ట్‌ సెక్షన్‌లో నన్‌, బ్యానర్స్‌, అలర్ట్స్‌ అని మూడు ఆప్షన్స్‌ ఉంటాయి. బ్యానర్స్ సెలెక్ట్ చేస్తే ఫోన్ పై భాగంలో నోటిఫికేషన్ వచ్చి ఆటోమేటిగ్గా వెళ్లిపోతుంది.
 
ఇక అలర్ట్‌లో నోటిఫికేషన్‌ వచ్చి తర్వాత రీడ్‌ లేదా డిస్‌మిస్‌ అని ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో రీడ్ సెలెక్ట్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. డిస్‌మిస్ క్లిక్‌ చేస్తే నోటిఫికేషన్ కనిపించదు. ఇక సౌండ్, వైబ్రేషన్‌ ఫీచర్‌ అవసరం అనుకుంటే ఎనేబుల్ లేదంటే డిసేబుల్ చేసుకోవచ్చు.