గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (10:44 IST)

వాట్సాప్ ద్వారా డిజిటల్ పేమెంట్లు: డిజిటల్ ఇండియాకు చేయూత నిచ్చేందుకే?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపై వాట్సాప్ యూజర్లు తమ నగదు లావాదేవీలను తమ యాప్ ద్వారా నిర్వహించుకునేలా ప్లాన్ చేస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారిగా డ

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపై వాట్సాప్ యూజర్లు తమ నగదు లావాదేవీలను తమ యాప్ ద్వారా నిర్వహించుకునేలా ప్లాన్ చేస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారిగా డిజిటల్ చెల్లింపులకు వీలుగా వాట్సాప్‌లో ఆ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. 
 
మరో ఆరునెల్లోనే చెల్లింపుల సేవలను వాట్సాప్‌లో చూడ‌వ‌చ్చ‌ని స‌మాచారం. వాట్సాప్‌ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించి ఓ ఉద్యోగ ప్రకటనను కూడా ఉంచారు. భారత్‌లో ‘డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ లీడ్‌’ పోస్టు భర్తీ కోసం దర‌ఖాస్తులు చేసుకోవాల‌ని వాట్స‌ాప్ కోరుతోంది. ఇందుకోసం భార‌త్‌లోని యూపీఐ, భీమ్‌ యాప్‌, ఆధార్‌ నంబర్‌ వ్యవస్థల గురించి మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది.
 
అలాగే పేమేంట్లు, మనీ ట్రాన్స్‌ఫర్లు ఇక వాట్సాప్ నుండి కూడా చేసుకొనే సదుపాయం కల్పిస్తోంది. డిజిటల్ ఇండియాకు చేయూతను ఇచ్చేందుకుగాను వాట్సాప్ వినూత్న కార్యక్రమానికి సన్నద్ధమౌతోంది. నల్లధనం నిర్మూలనకుగాను కేంద్రం డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే వాట్సాప్ ఈ మేరకు కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.