శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (20:08 IST)

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు కొత్త అప్డేట్.. ఏ గ్రూప్‌లో ఉన్నారో తెలుసుకోవచ్చు..

whatsapp
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు కొత్త అప్డేట్ విడుదలైంది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు వీలుగా నావిగేట్ చేయడం సులభం అవుతుంది. కొత్త అప్‌డేట్‌తో ఎవరెవరు గ్రూప్‌లలో చేరవచ్చు మీరు ఏ గ్రూప్‌లతో షేర్ చేయవచ్చో నియంత్రించడాన్ని సులభతరం చేస్తుంది. 
 
ఈ కొత్త అప్‌డేట్‌ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఏదైనా కాంటాక్ట్ నేమ్‌పై క్లిక్ చేస్తే, ఏ గ్రూప్‌లో ఉన్నారో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో మీరు ఇతరులతో ఏయే గ్రూపుల్లో ఉన్నారో సులభంగా తెలుసుకోవచ్చు. కొత్త ఫీచర్లు రాబోయే వారాల్లో అంతర్జాతీయంగా అందుబాటులోకి వస్తాయి.