శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (09:25 IST)

చార్జింగ్‌ కాదు కదా అసలు బ్యాటరీయే అక్కర్లేని ఫోను...

సాధారణంగా చేతిలో మొబైల్ ఉంటే ఖచ్చితంగా జైబులో చార్జరో, పవర్ బ్యాంకో ఉండాల్సిందే. లేకుంటే రోజు గడవని పరిస్థితి. కానీ, ఇకపై వీటితో పనిలేదు. చార్జింగ్ కాదు కదా అసలు బ్యాటరీయే అక్కర్లేని ఫోను త్వరలోనే అంద

సాధారణంగా చేతిలో మొబైల్ ఉంటే ఖచ్చితంగా జైబులో చార్జరో, పవర్ బ్యాంకో ఉండాల్సిందే. లేకుంటే రోజు గడవని పరిస్థితి. కానీ, ఇకపై వీటితో పనిలేదు. చార్జింగ్ కాదు కదా అసలు బ్యాటరీయే అక్కర్లేని ఫోను త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ తరహా ఫోనును వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం సృష్టించింది. తొలి బ్యాటరీ ఫ్రీ మొబైల్ ఫోన్ ఇదే కావడం గమనార్హం.
 
ఈ వినూత్న సెల్‌ఫోన్‌ విద్యుత్‌ వినియోగం అస్సలు అక్కర్లేదు. దీనికి కావాల్సిన కొద్దోగొప్పో అవసరమైన శక్తిని సెల్‌ఫోన్‌ తనకు తానుగా తయారుచేసుకుంటుంది. ఆ శక్తిని కూడా రేడియో తరంగాల నుంచి గ్రహించేలా తీర్చిదిద్దారు. కాంతి తరంగాల నుంచి కూడా ఈ సెల్‌ఫోన్‌ శక్తిని గ్రహిస్తుందట. కాగా, ఈ వినూత్న ఫోనును ఆవిష్కరించిన పరిశోధక బృందంలో భారత సంతతికి చెందిన శ్యాం గుల్లకోట అనే ప్రొఫెసర్ కూడా ఉండటం గమనార్హం.