ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (09:04 IST)

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌తో షియోమీ రెడ్‌మీ 4, 4ఎ ఫోన్లు.. ఫీచర్లు... ధర వివరాలు...

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ... తన నూతన స్మార్ట్‌ఫోన్లు 'రెడ్‌మీ 4, 4ఏ'లను సోమవారం విడుదల చేయనుంది. స్టాండర్డ్, హైఎండ్ వేరియెంట్లలో రెడ్‌మీ 4ని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ... తన నూతన స్మార్ట్‌ఫోన్లు 'రెడ్‌మీ 4, 4ఏ'లను సోమవారం విడుదల చేయనుంది. స్టాండర్డ్, హైఎండ్ వేరియెంట్లలో రెడ్‌మీ 4ని మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. కాగా, ఈ రెండు ఫోన్ల ధరలను కూడా ఆ కంపెనీ బహిర్గతం చేసింది. రెడ్‌మీ 4 స్టాండర్డ్ ధర రూ.6,900గానూ, రెడ్‌మీ 4 హైఎండ్ వేరియంట్ ధర రూ.8,880గా నిర్ణయించింది. ఇక రెడ్‌మీ 4ఎ రూ.4,930 ధరకు అందుబాటులోకి రానుంది. 
 
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే... షియోమీ రెడ్‌మీ 4 స్టాండర్డ్ వేరియెంట్ ఫీచర్లు... ఐదు అంగుళా హెచ్‌డీ ఐపీఎస్, 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రా రెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 
 
అలాగే, షియోమీ రెడ్‌మీ 4 హై ఎండ్ వేరియెంట్ ఫీచర్లను పరిశీలిస్తే.. 5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.