గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:56 IST)

వారిని ఎక్కువ గారాబం చేస్తే..?

ఇంట్లో పిల్లలుంటేనే గొడవలు ఎక్కువగా ఉంటాయి. అందుకు కారణం ఏదైనా కావొచ్చు.. కానీ ఆ గొడవలు మాటలకే పరిమితంకావు.. కొట్టుకోవడం వరకు వెళ్తారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అవేంటంటే..
 
ఒక్కోసారి పిల్లలు అతిగా ప్రవర్తించడానికి మీరు వ్యవహరించే తీరూ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. అదెలా అంటారా..? చిన్నపిల్లాడనో లేక ఒక్కతే ఆడపిల్లనో ఎక్కువ గారాబం చేస్తుంటారు. మీరు శ్రద్ధ చూపించేవారికి ఇది అలుసుగా, చిన్నారులు తమపై నిర్లక్ష్యం చూపుతున్నారని భావించే ప్రమాదం ఉంది. తప్పెవరిదైతే వారినే మందలించాలి. అలానే క్షమాపణ అడిగే అవకాశాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా వారి తప్పును వారు సరిదిద్దుకునే అవకాశం కల్పించాలి.
 
పిల్లల మధ్య గొడవలకు కారణం ఏదైనా.. సమస్యకు మూలం తెలుసుకోకుండా.. పెద్దోడే చేశాడు.. చిన్నదే మంచిది అంటూ మీరు సర్టిఫికెట్‌లు ఇచ్చేయొద్దు. ఎందుకంటే.. వాళ్లు ఆ తప్పు చేయకపోయి ఉండొచ్చు. కనుక ఎప్పటి సమస్యను అప్పుడే తెలుసుకోవాలి. చిన్న పిల్లల గొడవే కదా అని చూసీచూడనట్టు ఉండడం అంత మంచిదికాదు.

ఈ కొట్లాటాల వలన పిల్లలకు తగలకూడని చోట దెబ్బలు తగిలితే సమస్యలు మరింత ఎక్కువైపోతాయి. ఇవి వారి మనుసులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందువలన ఎవరు గొడవపడినా తప్పెవరిది అనే విషయం పక్కనపెడితే అలా చేయడం తప్పన్న విషయం స్పష్టంగా వారికి చెప్పాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు ఉంటే ఆ విషయం మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పాలి.