శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 17 మార్చి 2017 (04:40 IST)

బద్దకాన్ని తరిమేయండి కానీ... నన్ను మాత్రం లేపొద్దు

భారతదేశం నుంచి బద్దకాన్ని తరిమేసే చైన్ సూత్రాన్ని చెబుతున్న వాడు నన్ను మాత్రం లేపొద్దంటున్నాడు. ఇదీ కవిత అంటే.. ఇదీ సమాజ దర్శనం అంటే..

సోషల్ మీడియాలో వ్యక్తుల భావవ్యక్తీకరణ ఎంత కొత్త పుంతలు తొక్కుతోందంటే సాంప్రదాయిక మీడియా ఇక ఎందుకూ పనికిరాదనిపిస్తుంది. భిన్నాభిప్రాయాన్ని సహించని తత్వం, భయంకరమైన అసహనం, బూతులతో సత్కారం అనే నెగటివ్ కోణం వెర్రి తలలెత్తుతున్నప్పటికీ సోషల్ మీడియా అత్యంత సృజనాత్మక ఆలోచనలకు, వ్యక్తీకరణలకు, వ్యంగ్య హాస్య రచనలకు ప్రతీకగా నిలుస్తోందనడానికి ఈ చిన్న కవిత చాలు. కవిత కాదు..  ఇది మన కళ్లముందటి సమాజ కపటత్వాన్ని, ద్వంద్వవైఖరిని నగ్నంగా చూపిస్తున్న నిలుపెత్తు దర్పణం. నా ఫేస్ బుక్ అపరిచిత మిత్రుడు పంపిన ఈ వ్యంగ్య కవిత చందవండి. భారతదేశం నుంచి బద్దకాన్ని తరిమేసే చైన్ సూత్రాన్ని చెబుతున్న వాడు నన్ను మాత్రం లేపొద్దంటున్నాడు. ఇదీ కవిత అంటే.. ఇదీ సమాజ దర్శనం అంటే..

 
మీరు పొద్దున్నే లేచి 
ముగ్గురిని నిద్రలేపండి.. 
 
వాళ్ల ముగ్గురిని 
మరో ముగ్గురిని లేపమనండి...
 
ఇలా బద్దకాన్ని
భారత దేశం నుంచి తరిమేయవచ్చు
 
గమనిక: 
నన్ను మాత్రం లేపొద్దు....

(నా ఫేస్ బుక్ మిత్రుడు దర్శన్ సింగ్‌కి కృతజ్ఞతలతో)