గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 27 ఆగస్టు 2019 (21:22 IST)

నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు...

నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
దళుకు బెళుకు రాళ్లు తట్టెడేల
చాటు పద్య మిలను తాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ
 
మంచి జాతి కలిగిన యింద్రనీల మణి ఒకటైనను చాల విలువ చేయను. మెరిసేటి రాళ్లు తట్టెడున్నను దాని విలువకు సరిపోవునా? సందర్భశుద్ధి గలిగిన అందమైన చాటు పద్యమొక్కటైనను లక్షల విలువ చేయును గాని వట్టి చప్పని పద్యములు వందయున్నను ఏమి లాభము.