సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (15:13 IST)

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు : ఏ పార్టీకి ఎన్ని సీట్లు

దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రానుంది. ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 353 సీట్లను దక్కించుకుని అతిపెద్ద కూటమిగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 51 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.

ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా కూడా వెల్లడయ్యాయి. ఇందులో అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, ఒడిషాలో బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్ఛా పార్టీ అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకున్న సీట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
బీజేపీ 303, కాంగ్రెస్ 52, డీఎంకే 23, టీఎంసీ 22, వైకాపా 22, శివసేన 18, జేడీయూ 16, తెరాస 9, టీడీపీ 3, బీజేఎస్పీ 10, ఎస్పీ 5, బీజేడీ 12, అన్నాడీఎంకే 1, సీపీఎం 3, ఎన్సీపీ 4, ఇతరులు 39 మొత్తం 542. 
 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (మొత్తం 175) : వైకాపా 151, టీడీపీ 23, జనసేన 1 
ఒడిషా అసెంబ్లీ (మొత్తం 147) : బీజేడీ 112, కాంగ్రెస్ 9, బీజేపీ 23, ఇతరులు 2. 
సిక్కిం అసెంబ్లీ (32) : ఎస్.డి.ఎఫ్ 15, ఎస్.కె.ఎం 17. 
అరుణాచల్ ప్రదేశ్ (60) : బీజేపీ 40, ఎన్.పి.పి. 6, కాంగ్రెస్ 4, ఇతరులు 10.