శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:37 IST)

మార్చి నాటికి అందుబాటులో ‘కొవిషీల్డ్‌’

వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌ నాటికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత మార్కెట్‌లో అందుబాటులో వస్తోంది. ఈ విషయాన్ని పూనేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ‘కొవిషీల్డ్‌’ పేరుతో అభివద్ధి చేసి, పరీక్షిస్తోందని తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ రెండు, మూడో విడత ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్‌ అభివృద్ధిపై నిర్వహించిన టూర్‌లో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు.

అనంతరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం అపెక్స్‌ డ్రగ్‌ రెగ్యులరేటర్‌కు రెండువారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు.