ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (10:44 IST)

ఆవు పొట్టలో 100 కేజీల ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, మేకులు, స్క్రూలు... షాక్ తిన్న వైద్యులు

అహ్మదాబాద్‌లోని జివ్‌దయా చారిటబుల్ ట్రస్ట్ ఆస్పత్రి వైద్యులు ఓ గోవు కడుపులో చెత్తను చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఆవు పొట్టలో ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, మేకులు, స్క్రూలు ఉండటాన్ని చూసి షాక్ తిన్నారు. ఆ తర్వాత

అహ్మదాబాద్‌లోని జివ్‌దయా చారిటబుల్ ట్రస్ట్ ఆస్పత్రి వైద్యులు ఓ గోవు కడుపులో చెత్తను చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఆవు పొట్టలో ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, మేకులు, స్క్రూలు ఉండటాన్ని చూసి షాక్ తిన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శబర్మతీ ప్రాంతంలో నడవడానికి ఇబ్బందిపడుతున్న ఓ గోవును రక్షించిన వైద్యులు దానికి పరీక్షలు నిర్వహించారు. పైగా ఆ ఆవు గర్భంతో ఉండడం, నడవడానికి ఇబ్బందులు పడుతుండడంతో వైద్యులు దానికి చికిత్స చేశారు. ఆపరేషన్ సందర్భంగా మూడు బకెట్ల చెత్తను తొలగించారు. 
 
అందులో ఎక్కవ శాతం ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, మేకులు, స్క్రూలు ఉన్నట్టు చారిటబుల్ ట్రస్టుకు చెందిన కార్తీక్ శాస్త్రి తెలిపారు. ఆవు కడుపు నుంచి ప్లాస్టిక్ బ్యాగులు తొలగించడం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఓ ఆవు కడుపు నుంచి 40 కేజీల చెత్తను తొలగించినట్టు కార్తీక్ పేర్కొన్నారు.