శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (11:27 IST)

13ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం.. ఆపై క్రికెట్ బ్యాట్‌తో హతమార్చారు..

చిన్నారులపై కామాంధులు విరుచుపడుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల దళిత బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం జరిపి, హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరా

చిన్నారులపై కామాంధులు విరుచుపడుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల దళిత బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం జరిపి, హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని బండి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఆరో తరగతి చదువుతుండేది.

బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి ఆమె తల్లిదండ్రులు 25 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో పెళ్లికి వెళ్లారు. దీన్ని ఆసరాగా తీసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఇంటికి వచ్చి బాలికపై అత్యాచారం జరిపి క్రికెట్ బ్యాట్‌తో హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. 
 
దుస్తులు లేకుండా బాలిక మృతదేహం పడి ఉండడాన్ని గ్రామస్థులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి ఐపీసీ సెక్షన్ 376, 302, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలిక ఇంటి తలుపు తెరచి ఉండటాన్ని బట్టి చూస్తే ఎవరో బాలికకు తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు.