శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (19:03 IST)

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14మంది మృతి

Madhya pradesh CM
Madhya pradesh CM
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయాలపాలైనారు. వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులు సత్నాలో జరిగిన కోల్ మహాకుంభ్ ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రేవా-సత్నా సరిహద్దులోని బర్ఖదా గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 
భోజనం కోసం రోడ్డు పక్కన బస్సులు ఆగడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగిపోయింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రక్కు టైరు పేలిపోవడంతోనే ఓ ట్రక్కు వేగంగా వచ్చి బస్సులను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.
 
ఈ  ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.  ఇంకా క్షతగాత్రులను పరామర్శించారు.