గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (18:51 IST)

కస్టడీ నుంచి విడుదలయిన నాగచైతన్య, కృతి శెట్టి

Naga Chaitanya
Naga Chaitanya
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ రోజుతో పుర్తయింది. దీనికి సంబధించిన వీడియోని టీం పంచుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్ లో కలుద్దాం’ అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ఆకట్టుకుంది.
 
‘కస్టడీ’ కి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. ఇప్పటికే విడుదల గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్‌లు ఎక్స్ టార్డీనరీ రెస్పాన్స్ తో అలరించాయి.
 
ఈ ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.