మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chira
Last Updated : శనివారం, 14 మే 2016 (13:16 IST)

చెల్లిపై అత్యాచారం చేసిన 16 యేళ్ళ సోదరుడు... గర్భం దాల్చడంతో వెలుగులోకి...

తోడబుట్టిన చెల్లికి రక్షణగా నిలవాల్సిన వాడు మృగంలా మారి చెల్లి పైనే పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేనా ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ అమాయకురాలు మిన్నకుండిపోయింది. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది. ఈ దారుణ సంఘటన సోనిపేటలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 12 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టైన ఈ బాలుడు ఇటీవలే జువెనైల్ హోం నుంచి విడుదలై బయటికి వచ్చాడు. కాగా ఈ బాలుడి తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. ఈ కుటుంబం సోనిపేటలోని భోండ్సీలో ఓ  ఇంట్లో అద్దెకు ఉంటోంది. 
 
ఇందులో కామాంధుడైన బాలుడు మూడో సంతానం కాగా అత్యాచారానికి గురైన బాలిక నాలుగో సంతానం. వీరిద్దరు కొన్నికారణాల చేత పాఠశాలకు వెళ్లడం మానేశారు. నెల క్రితం మొదటిసారి తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత మరో రెండు సార్లు కూడా రేప్ చేసినట్లు తెలిపింది. 
 
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, చెబితే చంపేస్తానని నిందితుడు చెల్లిని బెదిరించాడట. దీంతో ఆమె విషయాన్ని దాచి పెట్టింది. కుటుంబ సభ్యులంతా పడుకున్న సమయంలో వేరే గదిలో తనపై అత్యాచారం చేసేవాడని బాధితురాలు పేర్కొంది. పోలీసులు ఈ బాలుడిపై కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నారు.