హోసూరులో బస్సు-కారును ఢీకొన్న లారీ... 18 మంది మృతి(vedio)
హోసూరు: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. జాతీయ రహదారిపై వేరుశనక్కాయల లోడుతో వెళుతున్న ఒక లారీ వేగంగా బస్సును, కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు దాదాపు నుజ్జు నుజ్జు అయింది. బస్
హోసూరు: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. జాతీయ రహదారిపై వేరుశనక్కాయల లోడుతో వెళుతున్న ఒక లారీ వేగంగా బస్సును, కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు దాదాపు నుజ్జు నుజ్జు అయింది. బస్సులో 10 మంది స్త్రీలు, 22 మంది పురుషులు ప్రయాణిస్తున్నారు.
లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జు అవడంతో 17 మంది అక్కడిక్కడే మృతి చెందారు. అక్కడ భీతావహ వాతావరణం కనిపించింది. పోలీసు ఉన్నతాధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు బాడీలో చిక్కుకున్న మృత దేహాలను వెలికితీయడం చాలా కష్టం అయింది. బంధువుల రోదనలతో ప్రమాద స్థలం బీభత్సంగా మారింది.