తోటి విద్యార్థిపై హేయమైన చర్య... జ్యూస్‌లో మూత్రం కలిపి తాగమని?
తమిళనాడులో తోటి విద్యార్థిపై హేయమైన చర్యకు పాల్పడ్డారు ఆతని స్నేహితులు. తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు వ్యక్తులు మూత్రంతో కలిపిన జ్యూస్ తాగమని తోటి విద్యార్థిపై ఒత్తిడి తెచ్చినందుకు సస్పెండ్ చేయబడ్డారు. బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రామ్‌జీ నగర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థి వైస్ ఛాన్సలర్ వి.నాగరాజ్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై తక్షణ చర్యగా, తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియమించింది.
దీనిపై కమిటీ ఒక నిర్ధారణకు వచ్చి జనవరి 18, 2024న తమ దర్యాప్తు నివేదికను సమర్పించింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు విద్యార్థులను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.