శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 5 నవంబరు 2020 (17:03 IST)

హర్యానాలో ఘోర విషాదం, కల్తీ మద్యం సేవించి 20 మంది మృత్యువాత

కల్తీ పదార్థాలు, మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అని చెప్పినా కొందరు మందు బాబులు మాత్రం తెగబడి వాటిని సేవిస్తుంటారు. అది చివరికి ప్రాణాలకు ముప్పుగా మారుతుంటుంది. ఈ క్రమంలో హర్యానాలో ఓ విషాదం చోటుచేసుకున్నది. కల్తీ మద్యం సేవించడంతో దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
 
హరియానా సోనిపట్‌లో ఈ విషాదం జరిగింది. కల్తీ మద్యం తాగి 20 మంది మృత్యువాత పడిన ఘటనపై సోనిపట్ ఏఎస్పీ వీరేంద్రసింగ్ స్పందించారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది కానీ ఇప్పటివరకు ఎవరిపైనా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 
 
నలుగురు మృతదేహాల శాంపిల్స్ తీసి టెస్టులకు పంపించాం. ఈ కేసులో దోషులు లేదా ఇందుకు బాధ్యులు ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడుతూ తెలిపారు. ఇలాంటి ఘటన జరిగితే తమకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.