శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:40 IST)

20 వేల బోగీల్లో 3.2 లక్షల కరోనా పడకలు

కరోనా బాధితుల కోసం 20వేల రైల్వే బోగీల్లో క్వారంటైన్​ లేదా ఐసోలేషన్​ పడకలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ప్రణాళిక విజయవంతమైతే 3.2లక్షల పడకలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్​ బాధితుల కోసం చైనా కేవలం10 రోజుల్లో వేయి పడకల ఆసుపత్రి నిర్మించి, తన శ్రామిక శక్తిని ప్రపంచానికి తెలియజేసింది.

అయితే భారత్​ వినూత్నంగా ఆలోచించి కదిలే ఐసోలేషన్​ వార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. అది కూడా ఒకటి రెండు కాదు. ఏకంగా 3.2 లక్షల పడకలు.