మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 13 జనవరి 2018 (17:32 IST)

మహారాష్ట్రలోని దహాను సముద్ర తీరంలో 40 మందితో వెళ్ళిన పడవ బోల్తా

మహారాష్ట్రలోని దహాను సముద్రతీరంలో 40 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. గల్లంతైన విద్యార్థుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 35 మంది విద్యార్థులను రక్

మహారాష్ట్రలోని దహాను సముద్రతీరంలో 40 మంది విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. గల్లంతైన విద్యార్థుల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 35 మంది విద్యార్థులను రక్షించినట్లు సమాచారం. నలుగురు విద్యార్థులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారని సహాయక సిబ్బంది తెలిపింది. గాలింపు చర్యలు వేగంగా జరుగుతున్నాయి.  
 
స‌హాయ‌క చ‌ర్య‌ల్లో డోర్నియ‌ర్ ఎయిర్‌క్రాఫ్ట్‌, హెలికాఫ్ట‌ర్లు పాల్గొంటున్నాయి. దహాను సముద్రతీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో పడవ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కేఎల్ పాండా స్కూల్ విద్యార్థులు ఈ పడవలో ప్రయాణం చేశారని అధికారులు వెల్లడించారు.