సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:51 IST)

24 గంటల్లో 85,362 కరోనా కేసులు.. 1,089 మరణాలు

భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,41,535 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 85,362 కేసులు వెలుగులోకి వచ్చాయి.

దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. వీరిలో 9,60,696 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 48,49,585 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.

ఇక కొత్తగా 1,089 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 93,379కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 82.14 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.58 శాతంగా ఉంది.