ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (13:05 IST)

నామక్కల్: బర్గర్ తిని వాంతులు చేసుకున్న బాలుడు

తమిళనాడు, నామక్కల్‌లో ఓ హోటల్‌లో సెప్టెంబర్ 10వతేదీన షవర్మా, గ్రిల్ చికెన్ తిన్న 14 ఏళ్ల విద్యార్థిని కలైయరసి ప్రాణాలు కోల్పోయింది. ఇంకా 43మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో తమిళనాడు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 
 
అంతేగాకుండా నామకల్ జిల్లా అంతటా షవర్మా విక్రయించడానికి నిషేధం విధించినట్లు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ హోటల్ వద్ద బర్గర్ తిన్న 18 ఏళ్ల బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో షాక్‌కు గురైన అతని తల్లిదండ్రులు నామక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మరో ఎనిమిది మంది కూడా వాంతులు, తల తిరగడంతో ఆస్పత్రిలో చేరారు.