గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:48 IST)

అన్న కోసం ఆస్పత్రికి.. లిఫ్ట్‌లో వెళ్తుండగా అత్యాచారం..

rape
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అఘాయిత్యాలు
చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువతిపై ఆస్పత్రిలో అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన యువతి వారం రోజుల నుండి అన్నయ్య సనత్ నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స చేయించింది.
 
అతని పక్కనే వుంటోంది. రాత్రి సోదరుడికి ఆహారం తీసుకురావడానికి ఆరో అంతస్తు నుంచి యువతి కిందికి వచ్చింది. తిరిగి వెళ్లబోతుంటే ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు ఆమెకు అక్కడి క్యాంటీన్లో పనిచేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. 
 
ఏదైనా సాయం కావాలంటే అతడ్ని సంప్రదించాలని సూచించాడు. ఆమె తిరిగి లిఫ్టులో వెళ్తుంటే షాదాబ్ అనుసరించి బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రక్త పరీక్షలు చేసే గదిలో మరోసారి అత్యాచారం చేశాడు. 
 
యువతి సోదరుడికి ఫోన్ చేయడంతో అతను నిందితుడిని పట్టుకునేందుకు గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఆ ప్రాంతం నుంచి నిందితుడు పారిపోయాడు. ఆస్పత్రి అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు షాదాబ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.