బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (13:53 IST)

90 ఏళ్ల వృద్ధురాలిని కూడా వదిలిపెట్టరా.. బైకిస్ట్ అత్యాచారం..

rape
మహిళలపై వయోభేదం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధులకు బుద్ధి రాలేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో  90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. 
 
వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాకు చెందిన గ్రామంలోని తన బంధువులను పరామర్శించేందుకు 90 ఏళ్ల వృద్ధురాలు గురువారం రాత్రి జబల్ పూర్ వెళ్లింది. అక్కడ నుంచి షాదోల్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. చీకటిపడిపోవడంతో ఆమె రాత్రిపూట రైల్వే స్టేషన్ లో వుండిపోయింది. ఆపై ఆటో రిక్షా ద్వారా అంట్రా గ్రామంలోని మెయిన్ రోడ్డుకు చేరుకుంది. 
 
ఆమె బంధువుల ప్రదేశానికి వెళ్లడానికి మరొక వాహనం ద్వారా వెళ్లాలని రిక్షా డ్రైవర్ రోడ్డుపై వదిలి వెళ్లాడు. దీంతో బంధువుల ఊరికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. బైకుపై అటుగా వెళ్లిన ఓ వ్యక్తి ఆమెను నమ్మబలికి బైకు ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆపై ఆమెను ప్రధాన రహదారిపై వదిలి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తుతెలియని మోటార్ సైకిలిస్ట్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత వృద్ధురాలు ఆసుపత్రిలో చేరిందని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.