గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (11:31 IST)

సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వస్తున్న మరో చీతాలు

cheetahs
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ జూ పార్కుకు మరికొందరు కొత్త అతిథిలు రానున్నారు. ఇప్పటికే నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ఈ పార్కుకు వచ్చాయి. ఇపుడు మరో 12 చీతాలు రానున్నాయి. రెండో విడతలో భాగంగా ఇవి సౌతాఫ్రికా నుంచి తీసుకొస్తున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజైన సెప్టెంబరు 17వ తేదీన ఈ ఎనిమిది చీతాలను కునో నేషనల్ పార్కులో ఆయన విడుదల చేశారు. ఇపుడు మరో 12 చీతాలను రప్పిస్తున్నారు. 
 
భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఇటీవల సౌతాఫ్రికాతో భారత్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులోభాగంగానే మొదటి విడతలో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు రాగా, ఈ నెల 12వ తేదీ సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు రానున్నాయి.