శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (12:44 IST)

50వ సారి అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్న పదేళ్ల బాలిక

Kerala Girl
Kerala Girl
కేరళకు చెందిన పదేళ్ల బాలిక 50వ సారి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోనుంది. 50వ సారిగా కేరళ శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునే ఆ బాలికకు అయ్యప్ప భక్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన అభిలాష్ మనీ కుమార్తె అతిథి.. తన 9 నెలల ప్రాయం నుంచే తండ్రితో పాటు తొలిసారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకుంది. ఆపై మాసపూజ, మండలపూజ, మకర జ్యోతి సమయంలో శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు సమాచారం. ఇలా ఏడాదికి మూడుసార్లుగా.. ఆ బాలిక పదేళ్ల వయస్సులో 50వ సారిగా అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. 
 
అతిధి నాలుగో తరగతి చదువుతోంది. తన తండ్రిలో 50వ సారిగా ఇరుముడి కట్టి శబరిమలకు వెళ్తున్న ఫోటోను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.