ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (09:23 IST)

అత్తపై దాడి చేసిన కోడలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

crime scene
కేరళలో అత్తపై దాష్టీకం ప్రదర్శించిన కోడలు అరెస్ట్ అయ్యింది. అత్తపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన కోడలు అరెస్ట్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కేరళ కొల్లామ్ జిల్లాలో ఓ వృద్ధురాలైన అత్త ఇంటి బయట నుంచి మెల్లగా వచ్చి హాలులో వున్న మంచంపై కూర్చుంది. 
 
ఇలా కూర్చుని టీవీ చూస్తున్న అత్తను మంచం మీద కూర్చోవద్దని, టీవీ చూడొద్దని కోడలు కోపగించుకుంది. అయినా అత్త పట్టించుకోలేదు. అలానే టీవీ చూస్తూ కూర్చుండిపోయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కోడలు వెనుక నుంచి బలంగా తోసేసింది. దీంతో వృద్ధురాలు ఒక్కసారిగా కిందపడిపోయింది. లేవలేక అలానే కూర్చుండిపోయింది. 
 
దీనిని బెడ్ రూమ్‌లో ఉన్న వ్యక్తి తన మొబైల్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్ అయ్యింది. అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేయడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.