గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (16:13 IST)

జననం 1995-డెత్ 2023.. ఇన్‌స్టాలో పోస్ట్.. ఆపై ఆత్మహత్య

suicide
సోషల్ మీడియాను మంచికి ఉపయోగించే వారు ఒక ఎత్తైతే.. దానిని వేరొక స్టైల్‌లో ఉపయోగించే వారు ఎక్కువవుతున్నారు. తాజాగా తన మరణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత, యువకుడు తన ఇంట్లో శవమై కనిపించాడు. 
 
కేరళ అలువా యూసీ కళాశాల కాటుపాడు కన్న పడావిల్‌లో షరీఫ్‌ కుమారుడు అజ్మలీ (28) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. ఇటీవల అజ్మల్‌ పని వెతుక్కుంటూ దుబాయ్‌ వెళ్లాడని, అక్కడ పని రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడని బంధువులు, ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. 
 
తన మరణానికి పది నిమిషాల ముందు, అజ్మల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతని మరణాన్ని సూచిస్తూ ఒక పోస్ట్‌ను కూడా పంచుకున్నాడు. అజ్మల్ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో జననం 1995-డెత్ 2023 అని పేర్కొని వున్నాడు. 
 
అజ్మల్‌ కుటుంబసభ్యులు అతడిని గదిలో ఉరివేసుకుని కనిపించి వెంటనే అలువా నజత్‌ ఆస్పత్రికి తరలించారు, అయితే అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు.