బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2023 (10:03 IST)

భారత్‌లో మళ్లీ కరోనా కలకలం.. 335 కొత్తకేసులు.. ఐదుగురు మృతి

covid
భారత్‌లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో నలుగురు కేరళ వాసులు వున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి కరోనాతో మరణించారు.  
 
దేశంలో మొత్తం 4.50 కోట్ల కరోనా కేసులు వెలుగుచూశాయి. జాతీయ సగటు రికవరీ రేటు 98.81  అంతేకాకుండా, ఇప్పటివరకూ 220.67 కోట్ల కోవిట్ టీకా డోసులు పంపిణీ చేశారు. కేరళలో ఇటీవల కొత్త కరోనా సబ్‌ వేరియంట్ జేఎన్.1 వెలుగు చూసిన సంగతి తెలిసిందే.