ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (17:17 IST)

భారత్‌లో కొత్త వేరియంట్: భయాందోళనలో ప్రజలు

Corona
కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కేరళలో ఒక్కసారిగా 19 కరోనా కేసులు పెరిగాయి. 
 
అంతేగాక, కోవిడ్ 19 కారణంగా రెండు మరణాలు కూడా సంభవించాయి. కొత్త వేరియంట్ జేఎన్-1 కేసును ఇవాళ కేరళలో నిర్ధారించారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. 
 
జేఎన్-1 నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. రాష్ట్రంలో నవంబర్ నెలలో 470 కేసులు ఉండగా.. డిసెంబర్ మొదటి పది రోజుల్లోనే 825 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.