కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయన కరోనా వైరస్ సోకినట్టు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వెళుతుండగా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు చేయగా, అందులో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు అయింది.
పైగా, రాజ్‌నాథ్ సింగ్‌ను పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత మంత్రి ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అతనికి తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
12 వేలు దాటిన కరోనా వైరస్ కేసులు..
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12 వేలు దాటిపోయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన మేరకు.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 12591కు చేరింది. బుధవారంతో పోల్చుకుంటే ఈ కేసుల సంఖ్య 20 శాతం మేరకు పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ ఉపరకమైన ఎక్స్ బీబీ 1.16 బాధితులే ఎక్కువా ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అర్హులైన వారంతా వీలైనంత త్వరగా బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచించింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొదటి, రెండో డోసులు కలిపి 220.66 కోట్ల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.67శాతంగా ఉందన్న కేంద్రం.. గడిచిన 24 గంటల్లో 10,827 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు 92.48 కోట్ల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. గడిచిన 24 గంటల్లో 2,30,419 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.