1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 మే 2025 (17:24 IST)

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

Lorry
Lorry
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే వున్నాయి. తాజాగా ఓ వీడియోలో యువతి తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వీడియోలో ఏటవాలుగా వున్న రోడ్డుపై లారీ వెనక్కి వచ్చింది. ఆ లారీ వెనకున్న లేడీ బైకర్ లారీ వెనక్కి రావడం గమనించి.. బైకును వెనక్కి నెట్టుకుంటూ వచ్చింది. అయినా లారీ వెనక్కి వస్తూ యువతి బైకుపై దూసుకెళ్లింది. 
 
ఈ ఘటనలో ఆ యువతి బైకు నుంచి దూరంగా పడిపోయింది. దీంతో ఆమె ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది. కానీ ఆ లారీ వెనక్కి రావడంతో ఆ యువతి బైకు నుజ్జు నుజ్జు అయ్యింది. 
 
దీంతో స్థానికులు లారీ డ్రైవర్‌ను నిలదీశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.