ఫ్రెండ్ పెళ్లికెళ్లాడు, కోటీశ్వరుడయ్యాడు
అతనికి లాటరీలు కొనడం అలవాటు. ఏదో ఒక విధంగా రెండు, మూడు లాటరీలను ప్రతిరోజు కొనేవాడు. అదృష్టం ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుందన్నది అతని నమ్మకం. ఎంతో డబ్బు లాటరీలను కొని పోగొట్టుకున్నాడు. కానీ ఆ డబ్బు మొత్తం రావడంతో పాటు అతని దశ తిరిగింది. కోటి రూపాయల లాటరీ తగిలి అమాంతం కోటీశ్వరుడయ్యేలా చేసింది.
కర్ణాటకలోని మాండ్య జిల్లా సోమనహళ్ళి గ్రామానికి చెందిన బలరామ్ ఈ నెల 5వ తేదీన తమ బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళాడు. ఈ నెల 5వ తేదీ కేరళలో జరిగిన పెళ్లికి వెళ్ళిన బలరామ్ 100 రూపాయల పెట్టి ఒక లాటరీ టిక్కెట్టు కొన్నాడు. ఎప్పటి లాగే వస్తుందో లేదోనని ఈరోజు ఉదయం అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
తాను కొన్న లాటరీకి ఏకంగా కోటి రూపాయలు వచ్చింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్వతహాగా రైస్ మిల్లు నడుపుతున్న బలరాం వచ్చిన డబ్బుతో రైస్ ఫ్యాక్టరీని మరింత అభివృద్థి చేస్తానంటున్నాడు. బలరాంకు బంధువులందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.