సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 4 జూన్ 2020 (23:05 IST)

ప్రేమికుల మధ్య గొడవ: హత్య చేసి చేతులు నరికి ఎత్తుకెళ్లాడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ సమీపంలో వున్న గ్రామం ఊరు బయట తల లేని మొండెంతో ఓ మహిళ శవం కనబడింది. దీనితో ఆ చుట్టుప్రక్కల కలకలం చెలరేగింది. దీనితో స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు.

తల లేని ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఐతే ఆ మహిళ మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నిందితుడుని పట్టుకోవడంలో ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఏడాదిగా సాగుతున్న గాలింపుతో చివరికి నేరగాడు పోలీసులకు చిక్కాడు. 
 
మరణించిన మహిళ బదియానాలోని మోది నగర్ ప్రాంతవాసిగా గుర్తించారు. గత ఏడాది మే నెలలో ఆ మహిళ కొంత బంగారంతో ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లుగా తేలింది. ఆమెతో అమీన్ అనే యువకుడు సన్నిహితంగా వుండటంతో అతడితో వెళ్లి వుంటుందనీ, అతడే హత్య చేసి వుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐతే ఆమె కాల్ లిస్టులో అమీన్ అనే పేరు లేకపోవడంతో పోలీసులకు ఇబ్బంది ఎదురైంది.
 
అమీన్ అనే యువకుడు అసలు పేరు సాహిబ్. ఇతడు సదరు మహిళను లొంగదీసుకుని ఆ తర్వాత కొద్దిరోజులుగా ఆమెతో గొడవపడటం ప్రారంభించాడు. ఆ క్రమంలో ఆమెపై కసి పెంచుకున్న సాహిబ్ కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి తాగించి ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఆమె చేతులపై ఇతడి పేరును పచ్చబొట్టు పొడిపించుకుని వుండటంతో ఆమెను హత్య చేశాక ఆ మహిళ రెండు చేతులను నరికి తీసుకెళ్లిపోయాడు. పోలీసుల దర్యాప్తులో నేరగాడు ఇవన్నీ అంగీకరించాడు.