ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 14 మార్చి 2017 (18:20 IST)

ఎలా వెళ్లాలో నువ్వు నాకు చెప్తావా...? టెక్కీని కత్తితో పొడిచిన వ్యక్తి

ఈ కలియుగంలో అధర్మం పిచ్చికుక్కలా పరుగెడుతుందని పెద్దలు చెపుతుంటారు. అలాగే మంచి మాటలు చెప్పినా వినేవాడుండడు. చెడు చెపుతుంటే చెవులు రిక్కించి మరీ వింటారు. కలియుగం గుణమే అంత. ఇంతకీ ఇప్పుడు కలియుగం సంగతి ఎందుకయ్యా అంటే, రాత్రివేళ కన్నూమిన్నూ కానరానట్లు ర

ఈ కలియుగంలో అధర్మం పిచ్చికుక్కలా పరుగెడుతుందని పెద్దలు చెపుతుంటారు. అలాగే మంచి మాటలు చెప్పినా వినేవాడుండడు. చెడు చెపుతుంటే చెవులు రిక్కించి మరీ వింటారు. కలియుగం గుణమే అంత. ఇంతకీ ఇప్పుడు కలియుగం సంగతి ఎందుకయ్యా అంటే, రాత్రివేళ కన్నూమిన్నూ కానరానట్లు రోడ్డు నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా మోటారు బైకుపై వస్తున్న ఓ వ్యక్తికి, ఇలా రావడం ట్రాఫిక్ రూల్సుకు విరుద్ధం అని చెప్పాడు ఓ టెక్కీ. 
 
అంతే... బైకుపై వచ్చిన వ్యక్తి... నువ్వేంటి నాకు రూల్స్ చెప్పేదంటూ వాగ్వాదానికి దిగి అతడిని కత్తితో పొడిచేశాడు. దానితో టెక్కీ అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కత్తిపోటు గుండె, ఊపిరితిత్తులకు కింది భాగంలో దిగడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా పొడిచిన వ్యక్తిపై కేసు పెట్టాలని సూచించగా బాధితుడు కేసు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. ఈ ఘటన పుణె నగరంలోని ఫెర్గూసన్ కాలేజి రోడ్డులో చోటుచేసుకుంది.