శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (16:17 IST)

చంద్రగ్రహణం రోజున నరబలి.. నగ్నపూజలు కూడా చేయించాడట.. బాబా ఎక్కడ?

తమిళనాడు, వేలూరు జిల్లా, వానియంబాడికి చెందిన ఓ బాలుడు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాలుడు ఓ బాబా చేతిలో నరబలి ఇవ్వబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడు, వేలూరు జిల్లా, వానియంబాడికి చెందిన ఓ బాలుడు అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాలుడు ఓ బాబా చేతిలో నరబలి ఇవ్వబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. వానియంబాడికి సమీపంలోని గ్రామానికి చెందిన మురుగన్ కూలి కార్మిక దంపతులకు హరికేశ్ తులసి అనే బాలుడు వున్నాడు. వీరి ఇంటి ఎదురుగా రవి అనే బాబా గత పదేళ్లుగా ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ ఆశ్రమంలో ఏడు అడుగుల ఎత్తులో ఓ నీటి తొట్టె వుంది. అందులో తాబేలను పెంచుతున్నారు. 
 
ఇక్కడికి వచ్చే భక్తులు రూపాయల నాణేలు తాబేళ్లను పెంచే తొట్టెలో నాణేలు వేస్తుంటారు. ఇదే ఆశ్రమంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంకా ఈ ఆశ్రమాన్ని నడిపే.. బాబా నగ్న పూజలను కూడా నడిపించినట్లు ఆ గ్రామస్థులు చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో మురుగన్ దంపతులు కూలీకి వెళ్ళి తిరిగొచ్చే సమయానికి హరికేష్ ఇంట్లో లేడు. దీంతో షాక్ అయిన మురుగన్ దంపతులు అతని కోసం ఎక్కడెక్కడో గాలించారు. చివరికి ఎదురుగా వుండే ఆశ్రమంలోని తొట్టెలో తులసి శవాన్ని కనుగొన్నారు. మరోవైపు బాబా మాయమైనాడు. దీంతో చంద్రగ్రహణం రోజున బాబా నరబలి ఇచ్చివుంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.