శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (13:19 IST)

ఆరునెలల శిశువుపై దారుణం... మత్తులో ఆ యువకుడు ఏం చేశాడంటే?

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఆరు నెలల శిశువు గొంతు కోశాడు ఓ యువకుడు. గంజాయి మత్తులో వున్న యువకుడు కత్తితో ఆరునెలల శిశువు కొంతుకోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై పుళల్ లక్ష్మీపురంకు చెందిన వివేక్ కుమార్- ప్రియ దంపతులకు ఆరు నెలల సాయి చరణ్ అనే శిశువు వుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ దంపతులు నివాసముండే ప్రాంతంలోనే ఆకాశ్ అనే యువకుడు తల్లిదండ్రులతో నివాసం వుంటున్నాడు. ఎక్కడికి వెళ్లినా యువకుడి ఇంటి తాళాన్ని ఆతడి తల్లి ప్రియ వద్ద ఇచ్చి వెళ్లేది. అలా ఓ రోజు ప్రియ ఇంటికి తాళం కోసం వెళ్లాడు ఆకాష్. ఇంటి తాళాలు ఆకాష్ వద్ద ఇచ్చేందుకు ప్రియకు ఇష్టం లేదు. 
 
ఎందుకంటే గంజాయి పీల్చిన మత్తులో వున్న ఆకాశ్‌కు ఇంటి తాళం ఇవ్వడం కుదరదని చెప్పేసింది ప్రియ. దీంతో ఆవేశానికి లోనైన ఆకాశ్  ప్రియ ఆరు నెలల శిశువును గొంతుకోశాడు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ప్రియపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శిశువు ఎగ్మోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.