ప్రియురాలిని నమ్మించి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్, ఆపై హత్య

ఐవీఆర్| Last Updated: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:45 IST)
తన ప్రియురాలిని నమ్మించి బైకుపై ఎక్కించుకుని తీసుకుని వెళ్లి తన స్నేహితులను పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. యువతి ప్రతిఘటించడంతో అందరూ కలిసి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మూటగట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వచ్చారు.

ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ఐతే ఈ దారుణం నిందితుల ద్వారానే తెలిసింది. యువతిపై అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసామనీ, ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ ప్రియుడు ఓ న్యాయవాదిని సంప్రదించాడు.

దీనితో సదరు న్యాయవాది విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. ఈ లోపుగా నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి వారి కోసం గాలిస్తున్నారు. కాగా హత్య చేయబడిని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దీనిపై మరింత చదవండి :