శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (13:18 IST)

ప్రేయసి వీడియోలు లీక్ చేసిన ప్రియుడు.. లక్షన్నర ఇస్తే డిలీట్ చేస్తానని.. లేదంటే..?

ప్రేమికులైన ఆ జంట మతాల పేరిట కలవలేకపోయారు. దీంతో రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఆ ప్రేమికులు విడిపోయారు. ఈ నేపథ్యంలోనే యువతి తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగనుంది. ఈ తరుణంలోనే రీఎంట్రీ ఇచ్చాడు ప్రియుడు. తనతో ఏకాంతంగా గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ప్రియురాలిని బెదిరించడం మొదలు పెట్టాడు.
 
తనకు రూ. లక్షా 50 వేలు ఇస్తే వీడియోస్ డిలీట్ చేస్తానని లేదంటే అందరికి పంపుతానని బెదిరించాడు. దీంతో సదరు యువతి అతడు అడిగినంత డబ్బు ఇచ్చింది. అయినా కూడా వేధింపులు ఆపలేదు. యువతి పెళ్లి చేసుకోబోతున్న యువకుడికి వీరిద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలు పంపాడు. ఆ వీడియోలు చూసి యువతి పెద్దలకు ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చెయ్యాలని తెలిపాడు. 
 
వారు వివరాలు అడిగితే తనకు వచ్చిన వీడియోల గురించి తెలిపాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రేమికుడిపై పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన మహారాష్ట్రలోని నలాసొపరా చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసును విచారిస్తున్నారు.