సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (11:31 IST)

అభినందన్‌కు కీలక పరీక్షలు.. శత్రుదేశం టార్చర్ చేసిందా అని?

జమ్మూకాశ్మీర్ ఆక్రమిత పాకిస్థాన్‌లో ప్యారాచూట్ నుంచి దిగిన కమాండర్ అభినందన్.. శుక్రవారం భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అభినందన్‌ భారత్‌ రాగానే ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో అభినందన్‌కు కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు  ఆయన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. 
 
అనంతరం ఆయన శరీరంలో పాక్‌ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? అనేది తెలుసుకునేందుకు స్కానింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అంతేకాదు.. ఆయన మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో పరీక్షిస్తారు. అభినందన్‌ నుంచి సమాచారం రాబట్టేందుకు శత్రుదేశం అతడిని టార్చర్‌ చేసిందా? అనే విషయానికి సంబంధించి వివరాలను సేకరిస్తారు.
 
ఇదిలా ఉంటే.. తన మొబైల్‌ ఫోన్‌లో పాకిస్థాన్‌ సిమ్‌ను కలిగి ఉండి, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని సరిహద్దు రక్షణ దళం (బీఎస్‌ఎఫ్‌) శుక్రవారం అరెస్టు చేసింది. పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతమైన ఫిరోజ్‌పూర్‌లో పట్టుబడ్డ అతడు పాక్‌ గూఢచారి అయ్యుండవచ్చని బీఎస్‌ఎఫ్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడి నెంబరు ఎనిమిది పాకిస్థాన్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో ఉందని, ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.