మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (16:20 IST)

కోడలితో శారీరక సంబంధం, మనవరాలితో సహా మామ జంప్

కోడలు అంటే కూతురితో సమానం. కొడుకు భార్యను సొంత కూతురిలా చూసుకోవాలి. చెడు మార్గాన వెళుతుంటే దండించాలి. కానీ ఇక్కడ ఈ మామ మాత్రం కోడలికి మాయమాటలు చెప్పాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగలేదు. ఆ సంబంధాన్ని కొనసాగించాలని ఇంటి నుంచి లేపుకెళ్ళాడు.
 
పానిపట్ ప్రాంతానికి చెందిన రంజన్, మనీషాకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. రంజన్ తండ్రి అంబరీష్. తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి ఎలక్ట్రికల్ షాపును నడుపుకుంటున్నారు. ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. అంబరీష్ భార్య అనారోగ్యంతో ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయింది.
 
కొడుకుతోనే కలిసి ఉంటున్నాడు అంబరీష్.  మనీషా, రంజన్‌కు 10 నెలల కుమార్తె ఉంది. లాక్ డౌన్ సమయంలో బిజినెస్ పడిపోవడం.. మళ్ళీ ఆ తరువాత షాపు తెరుచుకోవడం జరిగాయి. అయితే షాపు తెరిచినప్పటి నుంచి ఎక్కువగా కొడుకే అక్కడే ఉంటున్నాడు.
 
అంబరీష్‌కు కాళ్ళ నొప్పులు ఉండటంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీంతో కోడలికి అంబరీష్ బాగా దగ్గరయ్యాడు. వీళ్ళ మధ్య గత రెండు నెలల నుంచి శారీరక సంబంధం నడుస్తోంది. కుమారుడికి విషయం తెలియదు. నిన్న మధ్యాహ్నం కోడలితో పాటు ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడు మామ.
 
కొడుకు షాపుకు వెళ్ళగానే ఆమెను, మనవరాలిని వెంట పెట్టుకుని పారిపోయాడు. రాత్రి అయినా ఎంతకూ కుటుంబ సభ్యులు కనబడకపోవడంతో రంజన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సి.సి. కెమెరాల్లో పరిశీలిస్తే మామ, కోడళ్ళు కలిసి వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.
 
దీంతో రంజన్ ఆశ్చర్యపోయాడు. వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన కుమార్తెను కూడా తీసుకెళ్ళిపోవడంతో రంజన్ లబోదిబోమంటున్నాడు.