ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (10:08 IST)

రెండు సముద్రాలు - రెండు తఫాన్లు : విరుచుకుపడనున్న లుబన్ - తితలీ

ఒకేసారి రెండు తుఫాన్లు రానున్నాయి. ఇందులో ఒకటి అరేబియా సముద్రంలో ఏర్పడగగా, మరొకటి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవుంది. ఈ రెండు తుఫాన్లు దేశంలో అలజడి సృష్టిస్తున్నాయి.
 
సోమవారం ఉదయం పశ్చిమ, దానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి "లుబన్" అని ఒమన్‌ నామకరణం చేసింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఒమన్‌ తీరం దిశగా కదులుతోంది. రానున్న ఐదు రోజుల్లో ఒమన్‌ పరిసరాల్లో తీరం దాటే క్రమంలో తీవ్ర పెనుతుఫానుగా మరింత బలపడనుంది. 
 
ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది మరింత బలపడి ఈనెల 10వ తేదీ నాటికి తుఫానుగా మారనుంది. దీనికి "తితలీ" అని నామకరణం చేశారు. 
 
రెండు సముద్రాల్లో ఒకేసారి తుఫాన్లు రావడం అప్పుడప్పుడు జరుగుతుంటుందని, ఇలా ఒకేసారి రావడం వల్ల రెండు తుఫాన్లు బలపడతాయని, తీరందాటే సమయంలో ఎక్కువ ప్రభావం చూపుతాయని వాతావారణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.