శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (17:35 IST)

మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడి మూత్ర విసర్జన

crime scene
మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ గిరిజన వ్యక్తిపై బీజేపీ నేత ఒకరు మూత్ర విసర్జన చేశాడు. ఇపుడు అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై స్నేహితుడు మూత్రం పోశాడు. ఇక్కడ బాధితుడితో పాటు నిందితుడు కూడా మంచి స్నేహితులే కావడం గమనార్హం. ఈ కేసులో ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన ఈ ఘటన జరుగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
రాష్ట్రంలోని సౌన్‌భద్ర జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో స్నేహితులైన బాధితుడు, నిందితుడు కలిసి పీకల వరకు మద్యం సేవించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన జవహర్ పటేల్... స్నేహితుడు గులాబ్‌ కోల్‌పై దాడి చేసి, ఆ తర్వాత మూత్ర విసర్జన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
బాధితుడు మద్యం మత్తులో ఉండటంతో ఏ జరిగిందో గుర్తించలేక పోయాడు. అయితే, ఈ ఘటనను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోనులో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడితో పాటు అతని స్నేహితుడిని కూడా అరెస్టు చేశారు.